

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ అంటే పడి చచ్చే అమ్మాయిలు చాలామందే ఉన్నారు. కేవలం సాధారణ అమ్మాయిలే కాదు సినిమా హీరోయిన్స్ సైతం ప్రభాస్ అంటే తమకు ఇష్టమని పబ్లిగ్గానే ఒప్పేసుకుంటున్నారు.
తాజాగా ఈ జాబితాలో తమిళ హాట్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా చేరింది. గతంలోనే ప్రభాస్ అంటే ఇష్టమని, బాహుబలి తర్వాత ఆ ఇష్టం మరింత పెరిగిందని తెలిపిన ఈ భామ.. మరోసారి తన మనసులోని మాటను వెల్లడించింది.
ఆ సినిమా తరువాత ఆయనపై ఇష్టం పెరిగిపోయింది…
ప్రస్తుతం ‘నాగకన్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. ఆ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తన సినిమా విశేషాలు వివరించింది. ఆపైన ‘’ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం.. తెలుగు హీరోల్లో నేను ప్రభాస్‌ను ఎక్కువగా అభిమానిస్తాను. నేను మాత్రమే కాదు ప్రస్తుతం దేశంలో ఎంతో మంది ఆయన్ను అభిమానిస్తున్నారు..’’ అంటూ చెప్పుకొచ్చింది.
అంతేకాదు, ‘‘బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని అయ్యా.. ప్రభాస్ స్టైల్, యాక్టింగ్ అంటే నాకు మహా పిచ్చి, ఆయనతో నటించే అవకాశం వస్తే క్షణం ఆలోచించకుండా ఓకే చేస్తాను..’’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేసింది. అక్కడితో ఆగలేదు, ‘‘నేను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే అది బాహుబలి ప్రభాస్‌కే చెబుతా..’’నంటూ ఇంకో అడుగు ముందుకేసింది.
వరలక్ష్మి మాటలు విన్న అభిమానులు ప్రభాస్‌కు ఐ లవ్ యు చెపితే.. మరి విశాల్ పరిస్థితి ఏంటి? అని అడుగుతున్నారు. ఎందుకంటే కొంతకాలం క్రితం వరకు విశాల్‌తో ప్రేమాయణం సాగించిన వరలక్ష్మి.. పెళ్లి వరకు కూడా వెళ్లింది. కానీ మళ్లీ ఏమైందో ఏమో ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం విశాల్ హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మాన్ కూతురు అనీశాను పెళ్లి చేసుకోబోతున్నాడు.
చదవండి : మరోసారి రియల్ హీరో అనిపించుకున్న విజయ్ దేవరకొండ! అమర జవాన్ల కుటుంబాలకి ఆర్థిక సాయం…








