హైదరాబాద్:  టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో ఫిక్స్ అయిన విషయం తెలిసందే. కూడా చాలా ఘనంగా నిర్వహించారు . కాగ తాజాగా వీరి పెళ్లి డేట్ ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

రామానాయుడు స్టూడియోస్‌లో విందు…

ఆశ్రిత వివాహం మార్చి 1న జరగనుంది. హైదరాబాద్ లో జరగనన్న వీరి వివాహానికి తెలుగు సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ సెలెబ్రిటీలు, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ వివాహా వేడుక అనంతరం, రామానాయుడు స్టూడియోస్ లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఆశ్రితది ప్రేమ వివాహమని తెలుస్తోంది. పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో పెళ్లి పనుల్లో వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నట్టు సమాచారం. ఆశ్రిత వివాహం వేడుక పూర్తయ్యాక తన చిత్రం ‘వెంకీ మామ’ షూటింగ్ లో వెంకటేశ్ పాల్గొంటారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

చదవండి : కమల్ హాసన్-వెంకటేశ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్: శ్రీకాంత్ అడ్డాల


English Title:

victory venkatesh dughter aashritha marriage date fix