మహిళా అభిమానులు నన్ను చంపేయరని భావిస్తున్నా? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఛార్మి ట్విట్!

4:37 pm, Sat, 9 February 19
Charmi Kaur hot comments on hero Ram

Charmi Kaur hot coemmts on ram

హైదరాబాద్ :  ఎనర్జిటిక్ స్టార్ రామ్ మహిళా అభిమానులు తనను చంపకుండా ఉంటారని భావిస్తున్నానంటూ ట్వీట్ చేసింది ఛార్మి. పూరిజగన్నాథ్- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా తన పూర్వ వైభవం వస్తుంది అని పూరి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇకపోతే తాజాగా సెట్స్‌పై మాస్క్ వేసుకొని రామ్ కూర్చున్న పిక్‌ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది ఛార్మి.

‘‘చాలా కష్టపడే యాక్టర్ రామ్. ఆయనలోని ఎనర్జీ, పాజిటివిటీ, ఇంకా అన్నీ(ఆయన వ్యక్తిత్వం) నాకు బాగా నచ్చుతాయి. అయితే ఈ మెసేజ్ చూసి ఆయన మహిళా అభిమానులు నన్ను చంపేయరని భావిస్తున్నా..’’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది ఛార్మి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.