ఆసక్తికరం: ల్యాండ్ మార్క్ మూవీ అయినంత మాత్రాన ఏ సినిమా ఆడదు: మహేష్ బాబు ‘మహర్షి’పై దిల్ రాజు వ్యాఖ్యలు!

maheshbabu dilraju, newsxpress.online

Mahesh_Babu_Maharshi_ comments on dil raju

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 25 న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మహేష్ కెరీర్‌లో ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్ మూవీ. మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ఇది.

ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా దిల్ రాజు ఈ సినిమా గురించి ఒక సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ చిత్రం. కేవలం ల్యాండ్ మార్క్ మూవీ అయినంత మాత్రాన ఏ సినిమా ఆడదు.. కథ బావుంటే ఆడుతుంది అని , ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేయడం ఖాయం అని చెప్పుకొచ్చాడు.

షో పూర్తయి బయటకు వచ్చేపుడు ఒక బరువైన హృదయంతో వస్తారు…

మహర్షి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు షో పూర్తయి బయటకు వచ్చేపుడు ఒక బరువైన హృదయంతో వస్తారు. అదేమిటనేది సినిమాలో చూస్తారు. ఆ పాయింట్ నేను ఇప్పుడే బయటకు చెప్పలేను అని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

రాజకీయాలకు సంబంధం లేని సినిమా ఇది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫీయ్యే విధంగా కథ ఉంటుందని తెలిపారు. మహర్షిలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా… అల్లరి నరేష్ స్నేహితుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సూపర్ స్టార్ సినిమాలన్నిటిల్లో ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పాడు.

చదవండి:  మహేష్‌పై వచ్చే రూమర్ నిజం కాదు? నమ్రత ఏం చెప్పిందంటే…