suicide

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ తెలుగు వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ సమీపంలో ఇతర మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించారు. చక్రాల కుర్చీలో చనిపోయిన ఈ వ్యక్తిని గుర్తించిన ఏపీ భవన్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. అతని వద్ద ఒక లేఖ, రూ. 20 నోటు.. కుర్చీ పక్కనే ఓ బాటిల్ గుర్తించారు. లేఖ ఆధారంగా మృతుడు శ్రీకాకుళం వాసిగా గుర్తించారు. పక్కనే ఉన్న ఖాళీ సీసా పురుగుల మందు అయి ఉంటుందని, అది తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతుడికి సంబంధించిన వారెవరైనా తమను సంప్రదించాలని కోరారు.


English Title:

a srikakulam man committed suicide in delhi