27.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ హీరోగా మారిన సుడిగాలి సుధీర్…

హీరోగా మారిన సుడిగాలి సుధీర్…

- Advertisement -

హైదరాబాద్: జబర్దస్త్, ఢీ లాంటి షోలతో పాపులర్ అయిన కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరో అవతారమెత్తాడు. ఇప్పటికే పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించిన సుధీర్… హీరోగా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ అనే సినిమా తెరకెక్కనుంది.

రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ, షియాజీ షిండే, పోసాని కృష్ణమురళి వంటి నటులు ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. శేఖర్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. శేఖర్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోంది.

ఇక ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ… ”అందరూ నన్ను హీరో అంటున్నారు. కానీ ఈ సినిమాకు కథే హీరో. దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఇంత తక్కువ సమయంలో ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడం నిజంగా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా… జూలై చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.

చదవండి: షూటింగ్‌కి సిద్ధమైన తారక్, చరణ్…
- Advertisement -