24.6 C
Hyderabad
Tuesday, November 3, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీని ఈ స్థాయిలో గెలిపించడం.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమా!?

వైసీపీని ఈ స్థాయిలో గెలిపించడం.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమా!?

CM YS Jagan News, YCP Latest news, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఏపీ రాజ‌కీయాల్లోనే అనూహ్యమైన ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చింది. ఎవ‌రూ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఎంత పెద్ద ఎగ్జట్ పోల్ స‌ర్వేకైనా కూడా నాడి ప‌ట్టుకోలేని రీతిలో ఏపీ ప్రజ‌లు వైసీపీకి అధికారం అప్పగించారు. 175 అసెంబ్లీ సీట్ల‌లో మొత్తం 150 స్థానాల్లో వైసీపీని గెలిపించారు.

అదే విధంగా 25 పార్లమెంటు స్థానాల్లో మొత్తం అన్నింటినీ 22 స్థానాల్లో గంపగుత్తగా వైసీపీకి అప్పగించారు. ఇలాంటి ప‌రిస్థితి కానీ, ఇలాంటి విజ‌యాన్ని కానీ బ‌హుశా వైసీపీ అదినేత జ‌గ‌నే ఊహించి ఉండ‌రు.

ప్రభుత్వ వ్యతిరేక‌త కావొచ్చు, స్థానికంగా ఉన్న టీడీపీ నేత‌ల‌పై ఉన్న తీవ్ర ఆగ్రహం కావొచ్చు, జ‌న్మభూమి క‌మిటీల దోపిడి కావొచ్చు ఇలా ఐదేనా చంద్రబాబుపైనా టీడీపీపైనా ప్రజాగ్రహం ఓట్లుగా మారి వైసీపీకి వ‌రంగా మారిపోయింది.

చదవండి:  వైఎస్ జగన్ కేబినెట్‌లో.. మంత్రులుగా చాన్స్ దక్కేదెవరికి?
నిజానికి ఇలాంటి విజ‌యం వ‌స్తుంద‌ని ఏపీలో ప్రజ‌లు కూడా ఊహించి ఉండ‌రు. అయితే, ఇప్పుడు ఇక్కడ నుంచే అనేక ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన విజ్ఞప్తికి ప్రజ‌లు ముగ్థులు కావ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టడం లేదు. అదే స‌మ‌యంలో అధికార మార్పిడిని కోరుకోవ‌డాన్ని కూడా ప్రజాస్వామ్య వాదులు, మేధావులు త‌ప్పుప‌ట్టడం లేదు.
 
అయితే, గుడ్డిగా ప్రజ‌లు ఒకే ఒక పొర‌పాటును మాత్రం త‌ప్పని చెబుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవ‌స్థలో ఏ ప్రభుత్వమైనా స‌రైన విధంగా, సక్రమ ప‌ద్ధతిలో ప‌నిచేయాలంటే.. ప్రభుత్వం చేసే త‌ప్పుల‌ను ఎత్తి చూపాలంటే.. ప్రజ‌లు ప‌క్షాన గ‌ళం వినిపించేందుకు మ‌రో గొంతు ఖ‌చ్చితంగా ఉండితీరాల‌ని అంటున్నారు.
 
తాజా ఫ‌లితాల్లో ఏపీ ప్రజ‌లు గుండుగుత్తుగా వైసీపీకి మ‌ద్దతు ప‌లికి.. అసెంబ్లీలో మ‌రో పార్టీ ముఖ్యంగా ప్రశ్నించేందుకు ప‌ట్టుమ‌ని 50 మంది కూడా లేని విధంగా తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యానికే ప్రమాద‌మ‌ని అంటున్నారు.
 
గ‌తంలో ఉన్న ప్రభుత్వాలు స‌హా తాజాగా ఓట‌మి పాలైన చంద్రబాబు ప్రభుత్వం వ‌ర‌కు ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పాల్పడిన‌ప్పుడు ప్రశ్నించేందుకు ప్రతిప‌క్షం కూడా బ‌లంగానే ఉండాలి. అంతే త‌ప్ప.. కేవ‌లం అధికార ప‌క్షమే బ‌లంగా ఉంటే.. ప్రభుత్వం చేసే త‌ప్పుల‌ను ప్రశ్నించేవారే క‌నిపించ‌ని ప‌రిస్థితి ఉంటుంద‌నిహెచ్చరిస్తున్నారు.
 
- Advertisement -