34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘మా’ ఎన్నికలు: పోటాపోటీ ప్రచారంతో వేడెక్కిన టాలీవుడ్, మెగాస్టార్ పూర్తి మద్దతు.. ఆ పార్టీ వారికే!

‘మా’ ఎన్నికలు: పోటాపోటీ ప్రచారంతో వేడెక్కిన టాలీవుడ్, మెగాస్టార్ పూర్తి మద్దతు.. ఆ పార్టీ వారికే!

megastar
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి పొగలు కక్కుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికలతో పాటుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు మార్చి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.  సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచాడు. నరేష్ తరుపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు.

తాజాగా వీళ్లంతా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆ మధ్యన అసోసియేషన్ నిధుల విషయంలో నరేష్, శివాజీ రాజా మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకున్న తర్వాత చర్చలతో వివాదం సద్దుమణిగింది.

పోటీ రసవత్తకరం….గెలిచేదెవరు?

ఇప్పుడు వీరిద్దరే అధ్యక్ష ఎన్నికల బరిలో పోటీ పడుతుండడంతో ఆసక్తిగా మారింది. తమ మధ్య విభేదాలు లేవని, ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడం వలనే తాను పోటీ చేస్తున్నానని నరేష్ అంటున్నారు. చిత్ర పరిశ్రమలో అందరి మద్దత్తు కూడగట్టే పనిలో నరేష్ ఉన్నారు.నరేష్, రాజశేఖర్, జీవితతో పాటు వారి మద్దత్తుదారులంతా కలసి మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.

chiranjeeviఈ సందర్భంగా చిరంజీవిని కలసి తమకు మా అసోసియేషన్ ఎన్నికల్లో మద్దత్తు తెలపాలని రాజశేఖర్ దంపతులు, నరేష్ చిరంజీవిని కోరారు. చిరు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మా అసోసియేషన్ భవన నిర్మాణమే ప్రధాన అంశంగా శివాజీ, నరేష్ ప్రచారం చేస్తున్నారుమా అసోసియేషన్ నిర్మించే కార్యాలయానికి తన సంపూర్ణ మద్దత్తు ఉంటుందని చిరంజీవి నరేష్, రాజశేఖర్ దంపతులతో అన్నట్లు తెలుస్తోంది.

మా అసోసియేషన్ ఎన్నికల్లో జీవిత, రాజశేఖర్ ప్రమేయం ఆసక్తిగా మారింది. రాజశేఖర్ ఇటీవల తన సినిమాల విషయంలో కూడా జోరు పెంచారు. గరుడవేగ చిత్రంతో చాలా కాలం తర్వాత తన సత్తా నిరూపించుకున్న రాజశేఖర్ ప్రస్తుతం కల్కి చిత్రంలో నటిస్తున్నాడు.

అలాగే నరేష్, రాజశేఖర్, జీవిత ఆదివారం రోజు సూపర్ స్టార్ మహేష్ ని కలసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరుని కలిశారు. సాధారణంగా ఇలాంటి పెద్ద స్టార్లు మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు. తెరవెనుక మాత్రమే ఉండిపోతారు. మా అసోసియేషన్ కు కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

maheshbabu

- Advertisement -