బెల్లంకొండ ఆశలన్నీ కాజల్ పైనేనా!? ఈసారైనా హిట్ కొడతాడా?

6:12 pm, Tue, 16 April 19
KAJAL-AGARWAL

హైదరాబాద్: తేజ డైరెక్షన్‌లో కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక హిట్ తర్వాత తేజ తీసిన సినిమా కావడం, కాజల్ కథానాయికగా నటించడంతో ‘సీత’కు ముందు ఓ మోస్తరుగా బజ్ కనిపించింది.

టీజర్ రిలీజయ్యాక అది మరింత పెరుగుతుందనుకుంటే కథ అడ్డం తిరిగింది. ఉన్న బజ్ కూడా పోయింది. ఈ నెల 25కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కానీ.. సినిమాకు బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగట్లేదని సమాచారం.

దర్శకుడు తేజ కానీ.. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కానీ ఈ సినిమాకు ప్లస్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. టీజర్లో వీళ్లిద్దరూ తేలిపోయారు. ఇప్పుడు ఈ సినిమాను కాపాడగలిగే సత్తా ఉన్నది కాజల్‌కు మాత్రమే అన్నది స్పష్టం.

హీరో కోసమో.. దర్శకుడి కోసమో జనాలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. కాజల్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఆమె గ్లామర్‌ను ఇష్టపడే రొమాంటిక్ ప్రియులు సినిమాపై ఓ కన్నేస్తారని చిత్ర బృందం ఆశిస్తోంది.

త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. అందులో కాజల్ గ్లామర్‌ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారట. అది వర్కవుటైతే బిజినెస్ విషయంలో ఏమైనా కదలిక ఉంటుందని.. ఓపెనింగ్స్ కూడా ఓ మోస్తరుగా వస్తాయని ఆశిస్తున్నారు.

వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఆయనకు ఈ సినిమా విజయవంతం కావడం చాలా అవసరం. ఆ మాటకొస్తే బెల్లంకొండ శ్రీనివాస్‌కు కూడా ఈ సినిమా సక్సెస్ కీలకం.