

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా – నరసింహారెడ్డి’ . ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అంచనాలు పెంచుతున్న ‘సైరా’ లుక్స్…
నేడు జగపతిబాబు పుట్టినరోజు కాగా, ఈ సందర్భంగా చిత్రంలోని ఆయన లుక్ ను, మోషన్ టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. సైరా జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారని చెబుతూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది.
ఇందులో జగపతిబాబు రెడ్డి రాజుగా నటిస్తున్నట్టు తెలుస్తుండగా, గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుటన కుంకుమతో జగపతిబాబు ‘అదుర్స్’ అనేలా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానుల ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
Wishing the versatile actor @IamJagguBhai a very Happy Birthday. Here’s the dynamic look of #VeeraReddy from #SyeRaaNarasimhaReddy. #HBDJagapatiBabu #SyeRaa pic.twitter.com/hGJ9IKwvpC
— Konidela Pro Company (@KonidelaPro) February 12, 2019








