రథ సప్తమి విశేషాలు.. విశిష్టత…

radha-sapathami-puja-procedure

radha-sapathami-puja-procedure-1మాఘ శుద్ద సప్తమి రోజున రథసప్తమి జరుపుకుంటారు. సూర్యుడు మకర ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకంగా ఈ పండుగకు రథసప్తమి అని పేరు వచ్చింది. సూర్యుని గమనం ఏడు గుర్రములు బంగారు రథం మీద సాగుతుందని వేదం చెబుతోంది. ఈ రోజు పవిత్రమైనదిగా భావించి సూర్యుడిని పూజిస్తారు.

మాఘ శుద్ద సప్తమినాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి.

సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగర స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేయకుండా, విడిచిన బట్టలు కట్టుకుని నదీ స్నానానికి వెళ్లకూడదు. నదీ స్నానానికి వెళ్ళే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి.. దానిని నెత్తి మీద జాగ్రత్తగా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్లలొ తేలుకుంటూ ముందుకు సాగి వెళ్లేలాగ సూర్యోదయ సమయాన స్నానం చేయాలి.

ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా , భుజాల మీదా , మోచేతి మడతల మీద , అరచేతుల్లోనూ ( మొత్తం ఏడు) జిల్లేడు ఆకులను తలపైన ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము (ఆకు తలపై ఉంచుకుని దానిపై రేగిపండు పెట్టి తల స్నానం చేస్తూ కింది శ్లోకాన్ని చదువుకోవాలి) .

శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం…

యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.
ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి*
జన్మ జన్మాంతరాలలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం, శోకం మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమి స్నానంతో నశించుగాక! అని దీనర్ధం. అన్నట్టు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది.

రోగ నివారణ /సంతాన ప్రాప్తి కోసం – రధ సప్తమి వ్రత విధానం..

స్నానాతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదళ పద్మం ముగ్గు (బియ్యం పిండి తో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి .

అష్ట దళ పద్మ మద్య లో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రధాన్ని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి.

సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెస్తునామొ లేదా ఎవరికీ సంతానం కలగాలని చెస్తునామొ వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవాలి .

తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా గ ఉండాలి . సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవాలి.

సప్త…. అంటే ఏడు కి చాలా విశిష్టత ఆకాశం లో ఇంద్రధనుస్సు రంగులు ఏడు, సూర్యభగవానుడి రధానికి అశ్వాలు ఏడు, సంగీతాలు స్వరాలు ఏడూ(సప్త స్వరాలు), మనకి సప్త వారాలు,( ఏడు రోజులు)సప్త ద్వీపాలు, సప్త ఋషులు,సప్త గిరులు సంగతి తెలిసిందే( ఏడు కొండలవాడు),సప్త సముద్రాలు, సప్త లోకాలు,.అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఎడు ముఖ్యమైనవి అని చెబుతారు.

ఆ ఏడింటి పేర్లు తెలుసునా…

మొదటి కిరణం- సుషుమ్నం
రెండవ కిరణం- హరి కేశు
మూడవ కిరణం- విశ్వ కర్మ
నాల్గవ కిరణం- విశ్వ వ్యచ
ఐదవ కిరణం- సంపద్వసు
ఆరవ కిరణం- అర్వాదము
ఏడవ కిరణం- స్వరాడ్వసు