ఇండియాస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్… ‘సాహో’! 18న ప్రీ రిలీజ్ ఈవెంట్…

- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. విజువల్ వండర్‌గా కనిపించింది.

ఇండియాస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే ఎన్నో అంచనాలు మొదలయ్యాయి.

ఈ నెల 30న సినిమా రిలీజ్ కాబోతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ వేడుకను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

ఈ వేడుకకు రెండు రాష్ట్రాల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా తరలి రానున్నారు. ఈనెల 18న ఈ వేడుకను నిర్వహించబోతున్నారు.

- Advertisement -