ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్.. ‘మా ఆయన బయల్దేరాడు’ అంటూ ఉపాసన ట్వీట్… 

RRR Press Meet ... Our Departure!, Newsxpressonline
హైదరాబాద్: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నిర్మితమవుతున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్)కు సంబంధించి ఇప్పటి వరకూ ఏ విధమైన వివరాలూ బయటకు వెల్లడి కాలేదన్న సంగతి తెలిసిందే.
 
ఇక సినిమా విశేషాలను, మరికొన్ని అంశాలను ప్రేక్షకులకు చెప్పేందుకు రాజమౌళి గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్లేందుకు రామ్ చరణ్ బయల్దేరారు. 

ట్విట్టర్‌లో ఫోటో పెట్టిన ఉపాసన…

చరణ్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వేళ, ఆయన భార్య ఉపాసన వెనుక నుంచి ఫోటో తీశారు. అంతేకాక, దాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ‘గుడ్ లక్ టీమ్..’ అంటూ అభినందనలు తెలిపారు. ఉపాసన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.