అమరావతి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగనున్న లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో మరోసారి చర్చించిన తర్వాత 32 మంది పేర్లను శాసనసభకు, నలుగురి పేర్లను లోక్‌సభకు ఖరారు చేశారు.
ఐదేళ్ల క్రితం ఏర్పాటైన జనసేన పార్టీ మార్చి 14న రాజమండ్రిలో ఆవిర్భావ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సభ నిర్వహణకు ముందే జనసేన తొలి జాబితా విడుదల చేయడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ ముందే ప్రకటించినట్టు రాజమండ్రి నుంచి ఆకుల సత్య నారాయణ, అమలాపురం నుంచి డీఎంఆర్ శేఖర్ ఎంపీగా పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్ధసారథి ఎంపీలుగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది.
ఎమ్మెల్యేల జాబితా విషయానికి వస్తే.. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణల పేర్లను పవన్ ఇంతకు ముందే ప్రకటించారు.
జనసేన పార్లమెంటు అభ్యర్థులు వీరే..
1. అమలాపురం: డి.ఎం.ఆర్ శేఖర్
2. రాజమండ్రి : ఆకుల సత్యనారాయణ
3. విశాఖపట్నం: గేదెల శ్రీనుబాబు
4. అనకాపల్లి: చింతల పార్ధసారధి
శాసనసభ అభ్యర్ధుల వివరాలు:
1. యలమంచిలి : సుందరపు విజయ్‌కుమార్,
2. పాయకరావుపేట: నక్కా రాజబాబు
3. పాడేరు : పసుపులేటి బాలరాజు
4. రాజాం : ముచ్చా శ్రీనివాసరావు
5.శ్రీకాకుళం : కోరాడ సర్వేశ్వరరావు
6. పలాస : కోత పూర్ణచంద్రరావు
7. ఎచ్చెర్ల : బాడన వెంకట జనార్ధన్(జనా)
8. నెల్లిమర్ల : లోకం నాగమాధవి
9. తుని : రాజా అశోక్‌బాబు
10. రాజమండ్రి సిటీ : కందుల దుర్గేష్
11. రాజోలు : రాపాక వరప్రసాద్
12. పి.గన్నవరం : పాముల రాజేశ్వరి
13. కాకినాడ సిటీ: ముత్తా శశిధర్
14. అనపర్తి : రేలంగి నాగేశ్వరరావు
15. ముమ్మిడివరం : పితాని బాలకృష్ణ
16. మండపేట : వేగుళ్ల లీలాకృష్ణ
17. తాడేపల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్
18. ఉంగుటూరు : నవుడు వెంకటరమణ
19. ఏలూరు : రెడ్డి అప్పలనాయుడు
20. తెనాలి : నాదెండ్ల మనోహర్
21. గుంటూరు వెస్ట్ : తోట చంద్రశేఖర్
22. పత్తిపాడు : రావెల కిషోర్‌బాబు
23. వేమూరు : ఎ.భరత్ భూషణ్
24. నరసరావుపేట : సయ్యద్ జిలానీ
25. కావలి : పసుపులేటి సుధాకర్
26. నెల్లూరు రూరల్ : చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
27. ఆదోని : మల్లిఖార్జునరావు(మల్లప్ప)
28. ధర్మవరం : మధుసూదన్‌రెడ్డి
29.రాజంపేట : పత్తిపాటి కుసుమకుమారి
30. రైల్వే కోడూరు : బోనాసి వెంకటసుబ్బయ్య
31. పుంగనూరు : బోడే రామచంద్ర యాదవ్
32. మచిలీపట్నం: బండి రామకృష్ణ








