31 C
Hyderabad
Wednesday, November 11, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘సీత’లో పాయల్ రాజ్ పుత్ ఐటమ్ సాంగ్.. ‘బుల్ రెడ్డి’ విడుదల రేపే!

‘సీత’లో పాయల్ రాజ్ పుత్ ఐటమ్ సాంగ్.. ‘బుల్ రెడ్డి’ విడుదల రేపే!

Seetha Movie Latest News, Payal Rajputh Latest News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్ : తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా ‘సీత’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాజల్‌కు జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు బుల్ రెడ్డి అంటూ సాగే ఒక ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారనేది తాజా సమాచారం. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఈ సాంగ్ ను వదలనున్నారు. ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ చేసింది.

ఈ పాటలో ఆమె ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసిందని చెబుతున్నారు. పాటలో ఆమె ఆర్ ఎక్స్ 100 బైక్‌ను కూడా నడుపుతుందని అంటున్నారు. ఈ ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఒక ఊపు ఊపేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకి ఈ ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత దర్శకుడు తేజ నుంచి వస్తోన్న ‘సీత’ సినిమా ఆయనకి మరో హిట్‌ను ఇస్తుందేమో చూడాలి.

చదవండి: ‘మజిలీ’కి పూర్తయిన సెన్సార్.. విడుదలకు అన్నీ సిద్ధం!
- Advertisement -