‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ రిలీజ్! ఇంత ఎనర్జీని ప్రేక్షకులు తట్టుకోగలరా?

8:37 pm, Wed, 3 July 19
ismart-shankar-movie-poster

హైదరాబాద్‌: ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఇస్మార్ట్‌ శంకర్’ ట్రైలర్‌‌ను బుధవారం ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో రామ్ ఎనర్జీ కాస్త ఎక్కువైందనే విమర్శలు రాగా.. ట్రైలర్‌లో అంతకుమించే ఎనర్జీని చూపించారు రామ్.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

చదవండి: ఎంతో పొందాను.. ఇంకెంతో కోల్పోయాను, అందుకే నటనకు గుడ్ బై!: ‘దంగల్’ ఫేమ్ జైరా…

‘ఏ బొమ్మా.. నువ్వు ఊ.. అంటే గోల్కొండ రిపేర్‌ చేసి నీ చేతిలో పెడతా.. నిన్ను బేగంని చేసి ఖిలా మీద కూర్చోపెడతా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. ‘నా దిమాక్‌ ఏందిరా డబుల్‌ సిమ్‌ కార్డు లెక్కుందీ..’ అంటూ రామ్‌ చెబుతున్న డైలాగ్, నభా నటేశ్‌ తెలంగాణ యాసలో రామ్‌ను బెదిరిస్తున్న సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.

ఇక ‘పిల్లి గుడ్డిదైతే ఎలుకు ఎగిరెగిరి చూపించిందట.. నీ జాతినా పుల్లా’.. ఈ డైలాగ్ వింటే ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ సినిమా ఎలా ఉండబోతుందో ఓ అంచనాకు వచ్చేయొచ్చు.

మొత్తం ట్రైలర్‌లో హీరో రామ్‌ యాటిట్యూడ్‌ హైలైట్‌గా నిలిచింది. బుర్రలో చిప్ పెట్టుకుని సగం మెంటల్, సగం బోజ్ పూరి విలన్‌లా కనిపిస్తున్న ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ తేడాగానే కనిపిస్తున్నాడు. నిజానికి రామ్ సినిమాల్లో ఎనర్జీ ఎక్కువైతే ప్రేక్షకులకు ఓవర్‌లా కనిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ ఎనర్జీ డబుల్ కావడంతో ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ని ఎలా తట్టుకుంటారో చూడాలి మరి.

అందాల ఆరబోత.. నాటు డైలాగ్స్

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. పూరీ మార్క్ ఆరబోతకు నాటు డైలాగ్స్‌కి కొదువేలేదు. ‘రేయ్.. వరంగల్ కాలేజ్‌లా పోరగాళ్లను ఉచ్చ పోయించినా’ అంటూ నభా నటేష్ ఓ రేంజ్‌లో చెప్తున్న డైలాగ్ ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతోంది. మరో పోరి నిధి అగర్వాల్.. గ్లామర్ షోకి తెరతీస్తూనే కథలో కీలకంగా కనిపిస్తోంది.

చదవండి: పోలీస్ ఆఫీసర్ పాత్రలో.. పాయల్ రాజ్ పుత్!

పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ‘ఇస్మార్ట్‌ శంకర్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక టెంపర్ సినిమా తరువాత సరైన హిట్ లేకపోవడంతో తన టెంపర్ మొత్తాన్ని ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’ సినిమాలో చూపించేశారు దర్శకుడు పూరీ. ఈ ఎనర్జిటిక్ టెంపర్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో.. 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగానే తేలిపోతుంది.