హైదరాబాద్: ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం నార్త్ ఇండియాలో ఈ చిత్ర షూటింగ్ చేస్తున్నాడు రాజమౌళి. ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా వడోదర షెడ్యూల్ పూర్తి చేస్తున్నాడు దర్శక ధీరుడు. మరో రెండు మూడు వారాల పాటు అక్కడే షూటింగ్ కి కూడా ప్లాన్ చేసాడు రాజమౌళి.
పక్క ప్రణాళికలతో షూటింగ్ ప్లాన్ చేసుకున్నరాజమౌళికి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. రామ్ చరణ్‌కు ఇప్పుడు గాయమైంది. ఈయన జిమ్ చేస్తుండగా మడిమకు చిన్న గాయం అయినట్టు తెలుస్తుంది. దీనితో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదే విషయాన్ని టీమ్ RRR కూడా ట్విట్టర్లో అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది.
దీనితో మూడు వారాల పాటు ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఊహించని విధంగా వచ్చిన సెలవులతో మెగా ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ కి గాయం కావడంతో పూణెలో జరగాల్సిన షూటింగ్ కూడా వాయిదా వేసాడు రాజమౌళి.
అయితే ఎన్టీఆర్ మాత్రం షూటింగ్‌లో ఉంటాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ లేనప్పటికీ ఎన్టీఆర్ తో చేయాల్సిన సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరిస్తాడని, చరణ్ సీన్స్ మాత్రం తర్వాత తెరకెక్కిస్తాడని తెలుస్తుంది.
దాంతో అనుకోకుండా జరిగిన ఈ ఇన్సిడెంట్‌తో ఇప్పుడు మెగాభిమానులు కూడా షాక్ లో ఉన్నారు. చరణ్ కి తగిలిన గాయానికి వైద్యులు మూడు వారాల వరకు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో హైదరబాద్ రానున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జ్యోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటించనుంది.
ఇకపోతే ఎన్నికలు కూడా ఉండటంతో సోషల్ మీడియాలో బాబాయ్ జనసేనకు అబ్బాయి సపోర్ట్ చేస్తాడేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఆయన బయటికి వచ్చి మాత్రం ప్రచారం చేయడం కష్టమే. మొత్తానికి ఏదేమైనా బ్రేకుల్లేకుండా సాగుతున్న RRR షూటింగ్ ఇప్పుడు చరణ్ గాయంతో వాయిదా పడింది . 2020 జులై 30న ఈ చిత్రం విడుదల చేయనున్నట్టు ఇటీవలే రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే.








