26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీ రైతులకు శుభవార్త! ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధుల జమ…

ఏపీ రైతులకు శుభవార్త! ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధుల జమ…

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని సర్కారు జమ చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రతి రైతు ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేసిన ప్రభుత్వం బుధవారం మొదటి విడత మొత్తం మిగిలిన రూ.3 వేలు వారి ఖాతాల్లోకి బదిలీ చేసింది.

కేంద్ర సాయంతో కలిపి రూ.15 వేలు..

దాదాపు 45 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.1349.81 కోట్లు మేర సర్కారు జమ చేసింది. పెట్టుబడి సాయం కింద ఏటా 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న రైతులకు కేంద్ర సాయం(రూ. 6000)తో కలిపి రూ.15 వేలు, పెద్ద రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

తాజా జమతో కలిపి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ రైతు కుటుంబాల అకౌంట్లలోకి రూ.4000 జమ చేసినట్లైంది. ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం కొనసాగితే… ఏడాది లోపు రూ.11000 జమ చేయాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వం మారితే… కొత్త ప్రభుత్వం ఏ స్కీం అమలు చేస్తుందో అదే ప్రయోజనం అందుతుంది.

చదవండి: జగన్ పై భారీ కుట్రను బయటపెట్టిన నిఘా వ్యవస్థ! ఎంత కుట్రో తెలుసా?
- Advertisement -