హైదరాబాద్: గత కొన్ని రోజుల ముందువరకు వరుస అవకాశాలతో, వరుస విజయాలతో దూసుకొచ్చిన యువ కథానాయకులలో రాజ్ తరుణ్ ఒకరు. అయితే క్రితం ఏడాది ఆయనను వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గాయి.
ఇక దూసుకుపోతాడా…?
ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన దిల్ రాజు ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ఇంతకుముందు దిల్ రాజు బ్యానర్లో లవర్ తో పరాజయాన్ని చవిచూసిన రాజ్ తరుణ్, మళ్లీ అదే బ్యానర్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఆడు మగాడ్రా బుజ్జి ఫేమ్ కృష్ణారెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.
ఈ సినిమాకి నీది నాది ఒకటే లోకం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
చదవండి: చంద్రబాబు పార్టీ మారలేదా? కేటీఆర్ హాట్ కామెంట్స్!








