32.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ రజని, మురగదాస్ సినిమాకి టైటిల్ ఫిక్స్!

రజని, మురగదాస్ సినిమాకి టైటిల్ ఫిక్స్!

darbhar first look
- Advertisement -

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘దర్బార్‌’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ముంబయి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఫస్ట్‌లుక్‌ను చూస్తే అర్థమవుతోంది.

బుధవారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌ మొదలు కానుంది. ఈ చిత్రం లో రజనీకాంత్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. మొదటి షెడ్యూల్ విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్‌ ఏర్పాటు చేశారట. దాదాపు 30 రోజుల పాటు అక్కడ మొదటి షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

ఇందులో రజనీకాంత్‌కు జోడీగా నయనతార నటిస్తోంది. రజనీకాంత్‌కు కుమార్తెగా నివేదా థామస్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్ అందిస్తుండగా, లైకాప్రొడక్షన్స్‌ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

- Advertisement -