
మంగళగిరి: సరిగ్గా పోలింగ్‌కు 48 గంటల ముందు వాట్సాప్‌లో ఒక సర్వే హల్‌చల్ చేస్తూ ఉంది. దాని ప్రకారం.. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి, చంద్రబాబు తనయుడైన లోకేష్ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనీసం నాలుగు వేల పైచిలుకు ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు.
కులాల వారీగా చాలా డీటెయిల్డ్‌గా ఉన్న ఆ సర్వే ప్రకారం.. ఆర్కే విజయం దాదాపు ఖరారైనట్లే. లోకేష్ దాదాపు నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోతారని సర్వేలో పేర్కొన్నారు. అయితే ఈ సర్వే ఎంత వరకూ నిజం అనేది తర్వాతి సంగతి. ప్రస్తుతానికి అయితే ఇది వైరల్‌గా మారింది. దీంతో ఎన్నికల రాజకీయంలో మంగళగిరి నియోజకవర్గం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
అన్ని సర్వేలూ చేయించాకే దించారుగా…
లోకేష్ కచ్చితంగా గెలిచే పరిస్థితి లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన్ని ఆ స్థానం నుంచి పోటీ చేయించే వారే కాదు.. అనేది మరోవైపు వినిపిస్తున్న మాట. బాబు వివిధ సర్వేలు చేయించుకున్నాకే మంగళగిరి నుంచి లోకేష్‌ను బరిలోకి దించి ఉండవచ్చు. రాజధాని ప్రాంతం కావడంతో అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ ఉండటంతో లోకేష్‌కు అక్కడ తిరుగుండదు అని బాబు భావించి ఉండవచ్చు.
అందులోనూ చంద్రబాబు నాయుడు తనయుడు కాబట్టి.. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఆ నియోజకవర్గంలో డెవలప్‌మెంట్ జరగవచ్చు అనే ఆశలు ప్రజల్లో కలిగే అవకాశం కూడా ఉంది. అది లోకేష్‌కు మరో ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలూ లేకపోలేదు.
తెలుగుదేశం అంటే అభిమానం లేకపోయినా.. ఒక పార్టీ అధినేత తనయుడు అక్కడ పోటీలో ఉంటే ప్రయోజనకరం అనుకునే వాళ్లూ ఉంటారు కదా? మరి వాళ్లే ఇప్పుడు లోకేష్‌ను రక్షించాల్సి ఉంటుంది.
లోకేష్‌కి టిక్కెట్‌తో ఆ వర్గం టీడీపీకి దూరమైందా?
అయితే మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలీలు అత్యధికంగా ఉన్నారు. వారికి సంబంధించిన నేతలు తమ పార్టీలో ఉన్నప్పుడు బాబు అక్కడ సర్వేలు చేయించుకున్నారని, అంతా అనుకూలంగా కనిపించిందని, తీరా లోకేష్‌కు టికెట్ ఖరారు అయ్యాక వారంతా దూరమయ్యారని, దీంతో ఇప్పుడు అక్కడ టీడీపీకి తేడా కొడుతోందనే విశ్లేషణలూ వినిపిస్తూ ఉన్నాయి.
మొత్తానికి ఏం జరుగుతుందో కానీ.. మంగళగిరి ఫలితంపై వేడిగా, వాడిగా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. దీనిపై బెట్టింగులు కూడా బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.








