రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. స్పెషల్ అప్డేట్! షాక్‌లో మెగా ఫ్యాన్స్!!

- Advertisement -

హైదరాబాద్: బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా, జూనియర్ ఎన్టీఆర్ బందిపోటు దొంగగా కనిపిస్తారని తెలుస్తోంది.

బాహుబలి ఫార్ములాతోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మార్చి 27 రామ్ చరణ్ జన్మదినం రోజున సినిమాలో చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆ ఆలోచన వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. ఎందుకంటే.. సినిమా పోస్టర్స్ ఇప్పుడే రిలీజ్ చేస్తే అంత బజ్ ఉండదని వెనక్కి తగ్గారట.

నిరాశలో మెగా ఫ్యాన్స్…

ఓ పక్క మెగా ఫ్యాన్స్ చరణ్ బర్త్ డే రోజు ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ వస్తుందని ఆశపడుతున్నారు. జక్కన్న మాత్రం ప్లాన్ చేంజ్ చేశాడట. పోస్టర్ కాకున్నా కనీసం స్పెషల్ అప్డేట్ ఏదైనా రివీల్ చేస్తారేమో చూడాలి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత షెడ్యూల్ కలకత్తాలో ప్లాన్ చేశారు.

బాహుబలి సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని రాజమౌళి రీసెంట్‌గా ఓ ఈవెంట్ లో అన్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే హీరోయిన్స్ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. త్వరలోనే కథానాయికల విషయంలో ఓ క్లారిటీ వస్తుందట.

చదవండి: శివరాత్రి వేడుకల్లో మెగాపవర్ స్టార్! దోమకొండ శివాలయంలో పూజలు!

- Advertisement -