వర్మకు చేదు అనుభవం.. ‘డేంజరస్‌’ ప్రదర్శనకు ‘నో ‘ అన్న ఐనాక్స్, పీవీఆర్ థియేటర్లు..

- Advertisement -

హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన తాజా చిత్రం డేంజరస్‌ ఈ నెల 8న దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో డేంజరస్ చిత్రాన్ని ప్రదర్శించేందుకు పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లు అభ్యంతరం వ్యకం చేశాయి. ఈ చిత్రాన్ని తమ థియేటర్లో ప్రదర్శించబోమంటూ వర్మకు తేల్చి చెప్పాయి. ఈ విషయాన్ని ఆర్జీవీ స్వయంగా వేదిక వెల్లడించాడు.

పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లు తన డేంజరస్‌ సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించినట్లు ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ సినిమాపై వారు వ్యవహరించిన తీరు సుప్రీం కోర్టు తీర్పునే వ్యతిరేకించేలా ఉందన్నారు.

‘‘నా సినిమా డేంజరస్ లెస్బియన్ కథాంశం, దానిని ప్రదర్శించడానికి నిరాకరించడం సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించడమే. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత కూడా వ్యతిరేకించడం ఎల్‌జీబీటీ(LGBT) కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అంటే పీవీఆర్‌, ఐనాక్స్ యాజమాన్యాలు ఎల్‌జీబీటీని వ్యతిరేకిస్తున్నట్టే. కాబట్టి ఈ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా..” అంటూ వర్మ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. వర్మ ట్వీట్‌పై పీవీఆర్‌, ఐనాక్స్‌ యాజమాన్యాలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇద్ద‌రు యువతుల మ‌ధ్య స్వ‌లింగ సంపర్కం నేప‌థ్యంలో వర్మ డేంజ‌ర‌స్ చిత్రాన్ని రూపొందించారు.

 

- Advertisement -