కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టనున్న.. పూరి జగన్నాథ్, ఛార్మీ!

5:09 pm, Mon, 8 July 19
puri-jagannath-charmi-kaur

హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, సినీ నటి ఛార్మీ ఇప్పటికే వ్యాపార భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. ‘పూరి కనెక్ట్స్’ పేరుతో వీరిద్దరూ కలసి ఇప్పటికే ఓ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా కొత్త హీరో, హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు.

చదవండి: ‘‘మా ఆయనతో సమంత కేక్ కటింగ్.. నేను హర్ట్..’’: శ్రీరెడ్డి తాజా సంచలనం

మరోవైపు, పూరి జగన్నాథ్‌కు సొంత నిర్మాణ సంస్థ ఉంది. దీని పేరు ‘పూరి టూరింగ్ టాకీస్’.  అయితే పూరి జగన్నాథ్‌తో ఉన్న అవగాహన మేరకు ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఛార్మీ పర్యవేక్షిస్తుంటుంది.

రెడీమేడ్ దుస్తుల విక్రయ రంగంలోకి…

ఇక తాజాగా వీరిద్దరూ కలసి మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు. వీరు రెడీమేడ్ దుస్తుల విక్రయ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. పురుషులకు సంబంధించిన దుస్తులను ఆన్‌లైన్‌లో అమ్మడం వీరి కొత్త వ్యాపారంగా తెలుస్తోంది. 

ఈ బిజినెస్ కోసం పూరి జగన్నాథ్, ఛార్మీలు beismart.in అనే వెబ్ సైట్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నటి, నిర్మాత ఛార్మీ తెలిపింది. తమ వెబ్‌సైట్‌ ద్వారా ముందుగా దుస్తులు ఆర్డర్ చేసిన వారికి 30 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుందని ఆమె పేర్కొంది.

చదవండి: ‘జుమాంజీ: ది నెక్స్ట్ లెవల్’ ట్రైలర్ రిలీజ్! క్రిస్మస్‌కి సినిమా విడుదల…