28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ఆసక్తికరం: ఒకేరోజు ప్రభుదేవా-తమన్నా జంటగా నటించిన రెండు సినిమాలు విడుదల…

ఆసక్తికరం: ఒకేరోజు ప్రభుదేవా-తమన్నా జంటగా నటించిన రెండు సినిమాలు విడుదల…

- Advertisement -

హైదరాబాద్: ఒకప్పుడు చిత్రపరిశ్రమలో ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలైన అరుదైన ఘటనలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా విడుదల చేయడం గగనం అయిపోయింది.

అయితే ప్రభుదేవా-తమన్నా జంటగా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకి సిద్ధమవుతున్నాయి. తమిళంలో తమన్నా – ప్రభుదేవా కలిసి ‘దేవి 2’ ( అభినేత్రి 2) సినిమా చేశారు.

ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే వీరిద్దరి కాంబినేషన్‌లో హిందీలో ‘ఖామోషి’ హారర్ సినిమా నిర్మితమైంది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీనే విడుదల చేయనున్నారు. 

ఇలా తమన్నా – ప్రభుదేవా కలిసి చేసిన సినిమాలు రెండు, ఒకే రోజున  విడుదల కావడం విశేషమని చెప్పాలి. అందులోనూ రెండు సినిమాలు హర్రర్ చిత్రాలు కావడం గమనార్హం.

చదవండి: ఎన్టీఆర్‌ పుట్టినరోజున అభిమానులకి సర్‌ప్రైజ్ ఇవ్వనున్న జక్కన్న..!

 

- Advertisement -