ఎగ్జిట్ పోల్స్‌పై తొలిసారిగా స్పందించిన జేడీ లక్ష్మీనారాయణ!

5:49 pm, Mon, 20 May 19
JD Lakshminarayana Latest News, Exit Polls Updates, AP Election News , Newsxpressonline

విశాఖ: ఏప్రిల్ 11 న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా లేదనీ, జనసేన పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్ల వరకు మాత్రమే వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయం లో జనసేన కీలక నేత, విశాఖ లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తాము నిత్యం ప్రజా సేవలో ఉంటామని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చాడు.

తాను ఈ ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోబోనని స్పష్టం చేశారు. ఈ ఎగ్జిట్ పోల్స్ ను చూసి ఆందోళన చెందకుండా ఈ నెల 23 వరకూ ఫలితాల కోసం ఎదురుచూడాలని జనసేన కార్యకర్తలు, అభిమానులను కోరారు.

విశాఖపట్నంలో ఈరోజు రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో అనవసరంగా ఉత్కంఠను కలిగిస్తున్నారని విమర్శించారు.

తాము ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ప్రభావం తమపై పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్నికలలో జనసేన ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

చదవండి: ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్వే: ఏపీలో అధికారం ఎవరిదంటే?