
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20వ సినిమాలో నిన్న మొన్నటి వరకు బిజీగా ఉన్నాడు. అయితే, ఆ తర్వాత కరోనా అవుట్ బ్రేక్‌తో షూటింగ్ నిలిచిపోయింది.
చదవండి: బయటకొచ్చిన మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ న్యూ లుక్
ప్రస్తుతం ప్రభాస్ పూర్తి విశ్రాంతి మూడ్‌లో ఉన్నాడు. కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ ప్రకటించకముందే జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇండియా చేరుకున్న ప్రభాస్ బృందం తదుపరి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటలీలో అనుకున్నారు కానీ…
తదుపరి షెడ్యూల్‌ను ఇటలీలో ప్లాన్ చేసింది. అయితే, కరోనా ప్రభావం ఇటలీలో ఎక్కువగా ఉండటంతో ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.
దీంతో ఇటలీలో చిత్రీకరించాల్సిన షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే సెట్స్ వేసి చిత్రీకరించాలనుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో మూడు భారీ సెట్స్ వేశారు.
చదవండి: ఎట్టకేలకు కరోనాను జయించిన గాయని కనిక.. ఈసారి నెగటివ్!
ఇప్పుడు మరో హాస్పిటల్ సెట్‌ను కూడా వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలనుకుంటున్నారట.
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఓ మైడియర్’, ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు టాలీవుడ్ భోగట్టా.








