‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో నారా దేవాన్ష్!

Nara-Devansh-act-an-ntr-biopic
- Advertisement -

Nara-Devansh-act an ntr biopic

హైదరాబాద్:  మాజీ సీఎం , విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విష్యం అందరికి తెలిసిందే. కాగ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

చిన్ననాటి ఎన్టీఆర్‌గ దేవాన్ష్…

మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఇక రెండో పార్ట్ మహానాయకుడు విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ముఖ్యంగా చూపించనున్నారు.

అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పోషించినట్టు సమాచారం. అలాగే ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్ కూడా నటించినట్టు తెలుస్తోంది.

ఈ మహానాయకుడిలో దేవాన్ష్‌కి సంబంధించిన షూటింగ్ కూడా కొద్ది రోజుల క్రితం పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

చదవండి: యాత్ర వర్సెస్ ఎన్టీఆర్ కథానాయకుడు! ‘యాత్ర’ విజయ రహస్యం ఇదే

- Advertisement -