హైదరాబాద్: తన అభిమాని ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలియగానే తక్షణమే స్పందించి సహాయం అందించే నటుడు జూనియర్ ఎన్టీఆర్.
ఆ మధ్య తన అభిమాని రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలియగానే తారక్ వెంటనే ఆ అభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు.
తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. ఆ అభిమాని పేరు జనార్ధన్.
ఈ విషయం తన అభిమానుల ద్వారా తెలియగానే తారక్ వెంటనే స్పందించాడు. జనార్ధన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.
‘‘జనార్ధన్‌కి ఏం కాదు.. మీరు ధైర్యంగా ఉండండి.. నేనున్నా.. అందరం కలిసి దేవుడ్ని ప్రార్థిద్దాం..’’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. అంతేకాదు ఒకసారి ఫోన్‌ను జనార్ధన్ చెవి దగ్గర పెట్టండి అని చెప్పి..
‘‘జనార్ధన్.. నేను ఎన్టీఆర్‌ని మాట్లాడుతున్నా.. నీకేం కాదు.. త్వరలోనే కోలుకుంటావు.. మనం త్వరలోనే కలుద్దాం.. నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా.. నీకు నేనున్నా.. మన అభిమానులున్నారు..’’ అంటూ ధైర్యం చెప్పారు.
స్వయంగా తారక్ ఫోన్ చేయడంతో జనార్ధన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తారక్ మాట్లడినప్పుడు.. ఆ మాటలకు జనార్ధన్ స్పందించాడని కూడా వారు పేర్కొన్నారు.
View this post on Instagram
#NTR Always Fan Of his Fans#PrayForJanardhan
pic.twitter.com/H9bhMSNjIY— 𝗡𝗧𝗥 𝗡𝗲𝘁𝘄𝗼𝗿𝗸 ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@WeLoveTarakAnna) June 29, 2022