kanna

అమరావతి : ప్రస్తుతం ఏపీలో రాజకీయం అట్టుడుకుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం తీవ్ర ఉగ్రరూపం దాల్చుతుంది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ కి స్పెషల్ స్టేటస్ ని కొరుకు నేడు సోమవారం ఢిల్లీ వేదికగా ధర్మ పోరాట దీక్షని చేస్తున్నాడు.

కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు …

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ ఇతర నేతలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన పరివారం ఎన్ని ఆటంకాలు సృష్టించినా గుంటూరులో జరిగిన ప్రధాని మోదీ సభ విజయవంతమయిందన్నారు. ఇది జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

తమ ప్రధాని అడవి సింహమైతే, టీడీపీ నాయకులు గ్రామ సింహాలని ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పిన వ్యక్తిలా మోదీ భార్యపైనా విమర్శలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అవినీతికి ప్పాడుతున్నారు కావునే తండ్రీకొడుకులపై మోదీ విమర్శలు చేశారన్నారు.

ఎయిమ్స్‌, ఎయిర్‌పోర్ట్సు, జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో తండ్రీకొడుకులు కమీషన్లు తీసుకున్నది నిజంకాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో బీజేపీ చెబుతుంటే ప్రజలు విశ్వసిస్తున్నారని, ఏమీ చేయలేదని చంద్రబాబు చెబుతున్నా నమ్మడం లేదని, అదే బాబులో అసహనాన్ని పెంచుతోందని అన్నారు.

చదవండి : వెన్నుపోటులో చంద్రబాబే సీనియర్!: ఏపీ సీంను ఏకిపారేసిన మోడీ, ‘తండ్రీకొడుకులు దిగిపోవాల్సిందే’…


English Title:

ap bjp president kanna lakshminarayana sensetional comments on cm