నిహారిక పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాగబాబు!

11:24 am, Mon, 11 February 19
nagababu ht coemmts on niharika

nagababu ht coemmts on niharika

తన కుమార్తె నీహారికకి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ,మంచి అబ్బాయి అయితే చాలని, కులంతో సంబంధం లేదని అంటున్నారు మెగాబ్రదర్ నాగబాబు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కుటుంబం, రాజకీయాలకు సంబంధించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు.

తన కూతురు నీహారిక నటన, పెళ్లి వంటి విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కథల విషయంలో నీహారిక చాలా చూజీ అని ఏ కాన్సెప్ట్ పడితే ఆ కాన్సెప్ట్ ఒప్పుకోదని నాగబాబు అన్నారు. తనను అసలు యాక్టింగ్ కి పంపించాలా వద్దా..? అని చర్చించినప్పుడు తన గట్టిగా నటిస్తానని చెప్పినట్లు నాగబాబు గుర్తు చేసుకున్నారు.

కులంకాదు ..గుణం కావాలి…

ఇక నీహారిక పెళ్లి గురించి మాట్లాడుతూ..’ రెండు, మూడేళ్లలో నీకు పెళ్లి చేస్తానని తనకు ముందే చెప్పాను. ఏదో నీ కోరిక తీర్చడానికి నటించేందుకు ఒప్పుకున్నాను తప్ప, వెబ్ సిరీస్ ఉన్నాయ్ కదా వాటిల్లో చేసుకో నువ్వు అని చెప్తే సరే అని చెప్పింది” అంటూ చెప్పుకొచ్చారు.

నీహారికకు సంబంధాలు వెతుకుతున్నట్లు.. త్వరలోనే ఆమెకి పెళ్లి చేసేస్తామని నాగబాబు స్పష్టం చేశారు. 2018 వరకు నీహారికకు టైం ఇచ్చినట్లు ఇప్పుడు మంచి సంబంధం వస్తే పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. మంచి వ్యక్తి, తన కాళ్లపై తాను నిలబడే వాడైతే చాలని పెళ్లికొడుకు ఎలా ఉండాలో చెప్పారు.

తన కాపు కులాన్ని గౌరవిస్తానని, తమ కులంలో మంచి అబ్బాయి దొరికితే మంచిదే, లేదంటే వేరే కులం వాళ్లైనా తనకు అభ్యంతరం లేదని అంటున్నారు. అన్ని కులాల వారిని గౌరవించాలని, తనకు కులంతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

చదవండి: నిహారిక పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాగబాబు!