24.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘జెర్సీ’ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. నాని కుమ్మేశాడు భయ్యా!

‘జెర్సీ’ ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్.. నాని కుమ్మేశాడు భయ్యా!

nani jercey first day collections, newsxpress.online
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, శ్రద్దా శ్రీనాధ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘జెర్సీ’. గత రెండు వరుస పరాజయాల తరువాత నాని నటించిన సినిమా కావడం, అలాగే ‘జెర్సీ’ నుండి విడుదలైన ట్రైలర్ , టీజర్స్ ఈ సినిమాపై అంచనాలని భారీగా పెంచేసాయి.

‘మళ్ళీరావా’తో క్యూట్ హిట్‌ని సొంతం చేసుకున్న గౌతమ్, మరోసారి ఈ జెర్సీ సినిమాతో తనలోని మరోకోణాన్ని బయటపెట్టాడు. లవ్ అండ్ ఎమోషనల్ కథని అందరికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాడు. తాను అనుకున్న పాయింట్‌ను గురితప్పకుండా తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. అలాగే సినిమాలో నటించిన ప్రతిఒక్కరు కూడా గౌతమ్‌కు అన్నివిధాలా సహకరించారు.

షాక్ లో సినీ ఇండస్ట్రీ…

ఇక సినిమా విషయానికొస్తే…. అర్జున్‌ రంజీ ట్రోఫీలో ఆడిన క్రికెట‌ర్‌. అత‌ను సారాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి నాని అని ఒక కొడుకు పుడ‌తాడు. చిన్నప్పటినుండి ఎంతో ఇష్టమైన ఆట అయిన క్రికెట్‌కి , 26 ఏళ్ల‌ప్పుడు దూరంగా వెళ్లి, ఫుడ్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగంలో చేర‌తాడు.

ఆలా కొద్దిరోజులపాటు ఎంతో సంతోషంగా గ‌డుపుతున్న వారి జీవితంలోకి అనుకోని ఇబ్బందులు వ‌చ్చి ప‌డుతాయి. లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరార‌న్న పేరుతో ఒక బ్యాచ్ ఫుడ్ కార్పొరేష‌న్ ఉద్యోగుల మీద స‌స్పెన్ష‌న్ వేటు ప‌డుతుంది. అందులో నాని కూడా ఉంటాడు.

ఆ తరువాత కుటుంబం కోసం తెలిసిన వాళ్లంద‌రి ద‌గ్గ‌ర అప్పులు తీసుకుని గ‌డుపుతుంటాడు. ఒకానొక సంద‌ర్భంలో కొడుకు అడిగిన చిన్న గిఫ్ట్ కూడా కొనివ్వ‌లేక‌పోతాడు.  ఆ తర్వాత కొడుకు కోసం ఏ ఆటనైతే వదులుకున్నాడో.. అదే ఆటని మళ్ళీ ప్రారంభించి, అందులోనే విజయం సాధిస్తాడు.

సినిమాకి ప్రధాన బలం.. ఇంటర్వల్‌కి ముందు వచ్చే సన్నివేశాలు, అలాగే చివరి 20 నిమిషాలే. రెండు పరాజయాల తరువాత నాని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా అన్నితరాల వారికి నచ్చే విధంగా ఉంది.

క్రికెట్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించడంతో షూటింగ్ దశ నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేశాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా నాని నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

26 ఏళ్ల కుర్రాడిగాను, 36 ఏళ్ల మధ్య వయస్కుడిగాను నాని అద్భుతంగా నటించాడు అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా పూర్తి పాజిటివ్ మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది.

తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్‌…

ప్రీమియర్స్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరగడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పైన కూడా పడింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జెర్సీ సినిమాకు రూ.26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

ఇకపోతే భారీ హైప్‌తో విడుదలైన ‘జెర్సీ’ తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్‌తో ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ జెర్సీ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా తోలి రోజే రూ.10 కోట్లకుపైగా గ్రాస్ వసూలు అయ్యింది. అలాగే రూ.8.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్స్‌ని కూడా రాబట్టింది. ఊహించని రేంజ్‌లో కలెక్షన్స్ రావడంతో చిత్ర యూనిట్ కూడా ఆనందంలో మునిగిపోయింది.

దీనికి తోడు జెర్సీకి వస్తున్న రివ్యూస్ అన్ని కూడా పూర్తిగా పాజిటివ్‌గా ఉండటంతో సినిమా ఓపెనింగ్స్ కి బాగా కలిసొచ్చింది. ఇప్పటికే పిల్లలకి హాలీడేస్ ఇవ్వడంతో పాటుగా, వీకెండ్‌ని కలుపుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద నాని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయచ్చు అని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి.

- Advertisement -