32.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ !

ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ !

Mahesh Babu Latest News, Mahesh Family Latest News, Tollywood News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: మహేశ్ బాబు ఏ మాత్రం కాస్త తీరిక దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాలకి వెళుతుంటాడు. సెట్స్ పై వున్న సినిమా పూర్తయిన తరువాత .. కొత్త సినిమా పట్టాలెక్కడానికి ముందు ఆయన ఇలా ఫ్యామిలీతో కలిసి సరదాగా విదేశాలకి వెళుతుంటాడు.

అలాగే ఆయన ఈ సారి మహర్షి సినిమా షూటింగు పార్టు పూర్తి కాగానే, ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ వెళ్లాడు. అంతా కలిసి అక్కడ సరదాగా షికారు చేస్తున్నారు.ఆ సమయంలో దిగిన ఒక ఫొటోను మహేశ్ బాబు శ్రీమతి నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

ప్యారిస్ లో ఒక సాయంత్రం అద్భుతంగా గడిచింది’ అంటూ మహేశ్ బాబు తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఈ ఫొటోలో మహేశ్ బాబును చూసిన అభిమానులు ఆయన మరింత యంగ్ గా కనిపిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఆయన అచ్చం గౌతమ్ కి బ్రదర్ లా వున్నాడని కొంతమంది అంటుంటే, మరికొంత మంది ‘సితార’ ఏమైపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు.

చదవండి: ‘ఆర్ఆర్ఆర్’లో కీలక మార్పులు! ఎవరి కోసమో తెలుసా?

- Advertisement -