23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ జొమాటో డెలివెరీ బాయ్ వీడియో వైరల్.. చూసి ఫైర్ అయిన మహేష్‌బాబు సతీమణి

జొమాటో డెలివెరీ బాయ్ వీడియో వైరల్.. చూసి ఫైర్ అయిన మహేష్‌బాబు సతీమణి

mahesh-babu-wife-namrata-fires-on-zomato-delivery-boy-1
- Advertisement -

mahesh babu wife namrata fires on zomato delivery boy

హైదరాబాద్: ప్రముఖ నటి, మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏమిటంటే.. రెండు రోజులుగా సోషల్ మీడియాలో జొమాటో డెలివెరీ బాయ్  వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో జొమాటో డెలివరీ బాయ్ ఒకరు కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్స్ ని విప్పి వాటిలోని పుడ్‌ని కొద్ది కొద్దిగా తిని.. మిగిలిన ఫుడ్‌ని తిరిగి ప్యాక్ చేసి కస్టమర్‌కి డెలివరీ చేశాడు. ఈ నిర్వాకం మొత్తం కెమెరాలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో  ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు సదరు జొమాటో ఫుడ్ డెలివరీ సంస్థపై విరుచుకుపడుతున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత సైతం ఈ వీడియో చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది.  వీడియోని తన ఇన్‌స్టా‌గ్రామ్ పేజీలో షేర్ చేసి చెడామడా తిట్టేసింది.

”ఇంత పేరున్న ఫుడ్ డెలివరీ సంస్థ పని తీరు చూస్తుంటే షాకింగ్ గా ఉంది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లు కనీస శుభ్రతని ఆశిస్తారు. కానీ ఈ విధంగానా డెలివర్ చేసేది..?  మీకు వర్క్ ఎథిక్స్ అనేవే లేవా..? ఇదంతా చూస్తుంటే ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇకనుండి  నా పిల్లలను మాత్రం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయనివ్వను. అందరికీ కూడా నా సజెషన్ ఇదే..” అంటూ రాసుకొచ్చారు నమ్రత.

https://www.instagram.com/p/BrPTJcZjJXB/

- Advertisement -