16 నుంచి ధనుర్మాస వ్రత పూజలు ప్రారంభం

- Advertisement -

గోదాదేవి గోపికలతో కూడి చేసిన విష్ణు పూజనే ధనుర్మాస పూజలు అంటారు. ఇక్కడ విష్ణువు అక్కడ గోదాదేవి పూజేంచేది రంగనాథుడిని.. నెల రోజులు ఈ పూజలను నిర్విఘ్నంగా చేయడం వల్ల సకల ప్రాణకోటికి ఆఖండ ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి.

అంతేకాకుండా ‘పర’ అంటే విష్ణుమూర్తి తనలో ఐక్యం చేసుకోవడం అని కూడా కాకినాడలోని జీపీటీ దగ్గర కొలువైన శ్రీ అలవేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు ధనుర్మాస వ్రతి విశిష్టతను వివరించారు. భక్తులందరూ పాల్గొనాలని కోరారు.

అలాగే ఈనెల 16 నుంచి మొదలుకొని జనవరి 14 వరకు ధనుర్మాస వ్రతం ప్రతిరోజు ఉదయం 5గంటల నుంచి సామూహిక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈనెల 18న ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

జనవరి 14న గోదా కల్యాణం సాయంత్రం 6 గంటల నుంచి వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని  ఈ వ్రతాన్ని చేయించి..ప్రతిరోజు పూజలలో పాల్గొనాల్సిందిగా రాష్ట్రంలోని వైష్ణావలాయాల కమిటీలు కోరుతున్నాయి.

- Advertisement -