హైదరాబాద్: ప్రతి ఒక్కరి ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ నేతలు దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు.
గురువారం పలువురు వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు. ఈ సందర్భంగా లో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
సర్వేల పేరుతో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వైళ్లి వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని వారు కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఓటర్లు అందరికీ ఓట్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కమిషనర్ ను ఈ సందర్భంగా వారు కోరారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి సరిదిద్దాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.
కమిషనర్ ని కలిసిన వారిలో ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాద్, మిథున్ రెడ్డి, తదితరులు ఉన్నారు.