మిలటరీ అధికారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు!

6:02 pm, Tue, 19 March 19
Mahesh Babu Latest Movie News, Maharshi Movie News, Latest Telugu Movie News, Newsxpressonline

హైదరాబాద్: టాలీవుడ్ మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ‘మహర్షి’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమా, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

ముగింపు దశలో ‘మహర్షి’

ఈ సినిమాలో మహేశ్ బాబు ఎలా కనిపించనున్నాడు? అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు దేశభక్తుడిగా కనిపించనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. మిలటరీ అధికారిగా పనిచేసే హీరో సెలవులకి తన ఊరికి వచ్చిన దగ్గర నుంచి కథ మొదలవుతుందని అంటున్నారు.

అనిల్ రావిపూడి తరహా వినోదంతో పాటు, దేశభక్తి పాళ్లు కూడా వుంటాయని చెబుతున్నారు. ఒక వైపున రాజమౌళి సినిమాలో చరణ్ , ఎన్టీఆర్ దేశభక్తులుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, మహేశ్ బాబు కూడా దేశభక్తుడిగానే కనిపించనున్నాడన్న మాట.