22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీలో చేరిన హీరో తనీష్: కౌశల్‌కు కౌంటరేనా?

వైసీపీలో చేరిన హీరో తనీష్: కౌశల్‌కు కౌంటరేనా?

Tollywood Hero Tanish joins YSRCP News, Tollywood hero tanish Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలోకి రాజకీయ నేతలతోపాటు సినీ నటుల చేరికలు కూడా కొనసాగుతున్నాయి. టాలీవుడ్ హీరో, బిగ్ బాస్ కంటెస్టెంట్ తనీష్ మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శంఖారావం సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

తాను ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని తనీష్ చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసేందుకు తనవంతుగా కృషి చేస్తానని తనీష్ వ్యాఖ్యానించారు. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈసీ మెంబర్‌గా కంటెస్టెంట్ చేసిన తనీష్.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.

కౌశల్ టీడీపీలో చేరగా..

సినిమాల్లో గత కొంత కాలంగా సరైన హిట్ లేని తనీష్.. బిగ్ బాస్ సీజన్ 2లో షో ద్వారా మరోసారి పాపులయ్యారు. ఇందులో విజేత అయిన కౌశల్‌కి తనీష్ గట్టిపోటీనే ఇచ్చాడు. ఫైనల్ లో వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ నడిచింది. వీరిద్దరి మధ్య జరిగిన వివాదాలు కూడా ఆ షోకి కూడా మంచి పాపులారిటీని తీసుకొచ్చింది.

అయితే, ఆ షో ముగిసిన తర్వాత బయట కూడా వీరిద్దరి మధ్య వివాదం కొనసాగడం గమనార్హం. పలు టీవీ షోల్లో కూడా వీరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కాగా, ఇటీవల కౌశల్ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో తనీష్ వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

 

- Advertisement -