25.6 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ యాత్ర-2లో రాజారెడ్డి, జగన్‌ పాత్రలే మెయిన్…

యాత్ర-2లో రాజారెడ్డి, జగన్‌ పాత్రలే మెయిన్…

- Advertisement -

హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004కి ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా చేసుకుని యాత్ర సినిమా రూపొందిన విషయం తెల్సిందే. ఇందులో మమ్ముట్టి వైఎస్ పాత్ర పోషించగా డైరెక్టర్ మహి వి రాఘవన్ తెరకెక్కించారు.

ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుని మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు మహి వి రాఘవన్ యాత్ర-2 తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

వైఎస్ఆర్ కథ రాజారెడ్డి, జగన్ లేకుండా అసంపూర్తేనని వ్యాఖ్యానించిన ఆయన, ‘యాత్ర-2’ కథలో వీరిద్దరివే ప్రముఖ పాత్రలని చెప్పారు. ‘యాత్ర’ సినిమాను వైఎస్ జగన్ ను చూపిస్తూ ముగించడానికి కారణం కూడా ఇదేనని అన్నారు.

అలాగే పార్ట్-1లో తామెక్కడ సినిమాను ముగించామో, అక్కడి నుంచి కొత్త సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు. వైఎస్ స్ఫూర్తితో జగన్ వేసిన అడుగులతో ఈ చిత్రం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

చదవండి: పదేళ్ళ పాటు జగన్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది: హీరో సూర్య
- Advertisement -