26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవం…

టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవం…

Chandrababu Naidu News, TDLP Latest News, AP Latest Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: తెలుగుదేశం శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా చంద్రబాబుని ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈరోజు అమరావతిలోని  చంద్రబాబు నివాసంలో  టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో అసెంబ్లీ, శాసన మండలిలో టీడీపీ పక్ష నేతలెవరన్నదానిపై చర్చించారు.

అయితే అసెంబ్లీలో టీడీపీ పక్ష నేతగా ఉండటానికి చంద్రబాబుకి ఆసక్తి లేదని, ఆయనకి బదులు అచ్చెన్నాయుడు లేదా పయ్యావుల కేశవ్‌ గాని ఉంటారని వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తల అన్నిటిని కొట్టిపారేస్తూ…ఎమ్మెల్యేలు అంతా చంద్రబాబుని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర పోషించనున్నారు.

ఇక శాసన మండలిలో టీడీపీ నుంచీ 34 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడు లేదా డొక్కా మాణిక్య వరప్రసాద్  ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలని గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెల్సిందే. అలాగే టీడీపీ 23 స్థానాల్లో గెలుచుకుంది. జనసేన 1 స్థానంలో విజయం సాధించింది,

చదవండి: ప్రభుత్వం ఎంత చేసినా…5 ఏళ్ళు పూర్తయ్యేసరికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది…
- Advertisement -