24.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ పుల్వామా దాడి: అనసూయ పోస్ట్‌పై నెటిజన్ల మండిపాటు! రంగమ్మత్త భావన మంచిదేకానీ…

పుల్వామా దాడి: అనసూయ పోస్ట్‌పై నెటిజన్ల మండిపాటు! రంగమ్మత్త భావన మంచిదేకానీ…

anasuya, newsxpress.online
- Advertisement -

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడిపై నటి, యాంకర్ అనసూయ చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్లతోపాటుగా, ఆమె ఫాలోవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘దాడిపై సంతాపం వ్యక్తం చేయని నువ్వు, బాధని, ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నవారిని కించపరుస్తావా?’’ అంటూ మండిపడుతున్నారు. కొంతమంది వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు.

ప్రతీకారం కాదు, నిజంగా ఆ బాధ ఎదుర్కొంటున్న వారికే తెలుస్తుంది…

వాస్తవానికి అనసూయ ఓ అమర జవాను కుమార్తె పోస్టు ద్వారా మంచి విషయాన్నే చెప్పాలనుకుంది. కానీ, అదికాస్తా మిస్‌‌ఫైర్ అయ్యింది. పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత సోషల్ మీడియాలో చాలామంది పాకిస్థాన్‌పై యుద్ధం చేయాలని, సర్జికల్ దాడులు చేయాలని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని పోస్టులు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో అనసూయ.. ప్రతీకారం కాదు, నిజంగా ఆ బాధను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారో చూడండనే అర్థం వచ్చేలా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టింది.

నిజంగా ఆ బాధను అనుభవించిన వ్యక్తులకు, కేవలం అరిచే వ్యక్తులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది చూపిస్తోంది..’’ అంటూ అనసూయ అమర జవాను లెఫ్టినెంట్ జనరల్ గౌతమ్ రవీంద్రనాథ్ కుమార్తె మానసి స్కాట్ చేసిన ట్వీట్  స్క్రీన్ షాట్‌ను అనసూయ షేర్ చేసింది.

‘‘ప్రతీకారం తీర్చుకుందామని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే.. అక్కడ పోరాడి, మీ కోసం ప్రాణాలు అర్పించేది మీరు కాదు కాబట్టి. మీరు రోడ్లపైనే మూత్రం పోస్తారు, ఉమ్ములు వేస్తారు, రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తారు, ఘోరంగా డ్రైవింగ్ చేస్తారు, అమ్మాయి, మహిళలపై అరుస్తారు. కులం, మతం, ప్రాంతాల వారీగా విడిపోయి ద్వేషించుకుంటారు. ఎన్నికల్లో నేరగాళ్లకు ఓటేస్తారు. మీరు చెబుతున్న ‘ప్రతీకారం’ విలువ తెలుసుకోండి. లేదా మీరే వెళ్లి ప్రతీకారం తీర్చుకోండి..’’

- Advertisement -