24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ బాలకృష్ణ…బోయపాటి సినిమా ప్రారంభం ఎప్పుడో తెలుసా?

బాలకృష్ణ…బోయపాటి సినిమా ప్రారంభం ఎప్పుడో తెలుసా?

Balayya Upcoming Movie News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ భారీ విజయాలను అందుకున్నాయి. మూడవ సినిమా చేయడానికి అవసరమైన ఏర్పాట్లలో బోయపాటి వున్నాడు.

మరో లెజెండ్ అవుతుందా..

ఈ సినిమాకి ముందు బోయపాటి చేసిన ‘వినయ విధేయ రామ’ భారీ పరాజయాన్ని చవిచూసింది. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ కారణంగా భారీగా నష్టపోయారు. అందువలన ఈ ప్రాజెక్టు ఉంటుందా .. లేదా అనే సందేహం అందరిలోనూ ఎక్కువవుతోంది.

ఈ సందేహానికి తెరదింపాలనే ఉద్దేశంతో బాలకృష్ణ బోయపాటి ముందుగా ఈ సినిమాను లాంచ్ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి, ఎన్నికల తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టవచ్చనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తారా? వేరెవరికైనా అప్పగిస్తారా? అనే విషయంలో క్లారిటీ రావాలసి వుంది.

చదవండి:హీరో ప్రభాస్‌తో సెల్ఫీ దిగి.. చెంపపై కొట్టిన యువతి.. అవాక్కయిన ‘బాహుబలి’!

- Advertisement -