హైదరాబాద్: మంచి కథ, సరైన స్ర్కిప్ట్ సిద్ధమైతే మళ్లీ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలకృష్ణతో దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ ఓ హిట్ చిత్రం తీస్తారంటూ నటి, సినీ నిర్మాత ఛార్మి కౌర్ తెలిపారు.
ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తదుపరి సినిమాలైన ‘ఫైటర్’, ‘రొమాంటిక్’ గురించి నెటిజన్లతో ముచ్చటించారు.
చదవండి: ప్రియా ప్రకాష్ వారియర్ చేసిన పనికి అభిమానులు షాక్! అసలేం జరిగిందంటే…
ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ గురించి స్పందిస్తూ.. ఆయన చాలా పాజిటివ్‌గా ఉండే వ్యక్తి అంటూ ఛార్మి కితాబు ఇచ్చారు. బాలకృష్ణ-పూరి జగన్నాథ్ నడుమ మంచి బంధం ఉందన్నారు.
ఆయనతో సినిమా తీయడానికి పూరి జగన్నాథ్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని, కాకపోతే మంచి కథ దొరకాలి, స్ర్ర్కిప్ట్ బాగా కుదరాలి అని ఛార్మి వివరించారు.
కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్న ఛార్మి నిర్మాతగా మారి ‘పూరి కనెక్ట్స్’ పతాకంపై పలు సినిమాలు నిర్మించారు. ‘రోగ్’, ‘మెహబూబా’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఇక పూరి జగన్నాథ్-బాలకృష్ణల కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా మాస్ ప్రేక్షకులను, ముఖ్యంగా బాలయ్య అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.
చదవండి: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ఐష్-దీపిక డ్యాన్స్ వీడియో
‘రూలర్’ తరువాత ప్రస్తుతం బాలకృష్ణ తన 106వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి బోయపాటి శ్రీను దర్శకుడు. కాకపోతే ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది.
ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారట. అంతేకాదు, ఈ చిత్రంలో లేడీ విలన్ ఉండబోతోందట. ఈ పాత్రకు నటి భూమికను తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.