పగబట్టిన ‘కరోనా’.. ఓ కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్.. తండ్రికి రెండుసార్లు…

corona bite in entire family in vizag and twice or the same person
- Advertisement -

అమరావతి: విశాఖపట్నంలోని ఓ కుటుంబంపై కరోనా పగబట్టినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, 8 మంది కుటుంబ సభ్యుల సహా 18 నెలల చిన్నారిని కూడా వైరస్ వేధిస్తోంది.

ఆశ్యర్యం ఏమింటే.. ఆ కుటుంబంలో ఓ వ్యక్తి ఇప్పటికి రెండుసార్లు కరోనా బారిన పడడం. వివరాల్లోకి వెళితే… ఈ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి(30) ముంబై నుంచి రాగా, ఏప్రిల్ 1న అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. 

చదవండి: కరోనా అప్‌డేట్: 24 గంటల్లో 4970 మందికి పాజిటివ్.. భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా…

అనంతరం ఒకటి రెండు రోజుల్లో ఆయన భార్య, 18 నెలల చిన్నారికి తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరికీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 

దీంతో వారందరినీ క్వారంటైన్‌కి తరలించారు. చికిత్స అనంతరం వారు ఏప్రిల్ 17, 18 తేదీల్లో డిశ్చార్జ్ అయి తిరిగి ఇంటికి చేరుకున్నారు. 

ఆ తరువాత ఐదు రోజులు కూడా తిరక్కమునుపే తల్లికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె కూడా క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. 

కొద్దిరోజులకు ఆమె కూడా వైరస్ బారినుంచి కోలుకోవడంతో కుటుంబ సభ్యులు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. 

చదవండి: టెన్త్ పరీక్షలు.. జూన్ మొదటి వారం తరువాతే, అదీ పరిస్థితి అనుకూలిస్తేనే: తేల్చేసిన హైకోర్టు

అంతలోనే మళ్లీ పెద్ద షాక్. ఈసారి 18 నెలల చిన్నారితోపాటు అతడి తండ్రికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.  

ఆ తండ్రికి కరోనా వైరస్ సోకడం ఇది రెండోసారి. దీంతో ప్రస్తుతం ఆ చిన్నారి సహా అతడ్ని ఆసుపత్రికి  తరలించారు. మిగిలిన కుటుంబ సభ్యులు హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

- Advertisement -