26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ చరణ్‌పై భారీ యాక్షన్ ఎపిసోడ్! అభిమానులకి ఇక పూనకమే!

చరణ్‌పై భారీ యాక్షన్ ఎపిసోడ్! అభిమానులకి ఇక పూనకమే!

rrr ramcharan
- Advertisement -

rrr ramcharan

హైదరాబాద్: టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ , నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం #ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకునే, ఇటీవలే ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

#ఆర్‌ఆర్‌ఆర్ లేటెస్ట్ అప్డేట్…

ప్రస్తుతం రాజమౌళి, చరణ్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. చెక్ పోస్ట్ దగ్గర ఆయన ఒక రౌడీ గ్యాంగ్ ను అడ్డుకోవడం, ఆ గ్యాంగ్ పై విరుచుకుపడటం చిత్రీకరిస్తున్నారు.

ఈ యాక్షన్ సీన్ లో వందలమంది ఫైటర్లు పాల్గొంటున్నట్టుగా సమాచారం. ఈ ఫైట్ సీన్ , ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ ఎపిసోడ్ నిలిచిపోతుందని చెబుతున్నారు. చరణ్ అభిమానులు విజిల్స్ వర్షం కురిపించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 300 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

చదవండి : బాలీవుడ్ భామ వైపు చూస్తోన్న జక్కన్న! ఆలియాభట్‌పై కన్ను?

- Advertisement -