26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం ఏపీ పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు నిజమే! కారణం ఇదే!

ఏపీ పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు నిజమే! కారణం ఇదే!

jagan mohan reddy comments on ap police
- Advertisement -

jagan mohan reddy comments on ap police

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పోలీస్ వ్యవస్థ పై పెద్ద చర్చ నడుస్తుంది.సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆద్వర్యంలోని ఏపీ పోలీస్ యంత్రాంగం రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మలా మారింది అనే ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఏపీ పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి రావని చంద్రబాబు చెప్పినట్టుగానే వారు వ్యహరిస్తారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న అంశం బయటకు వచ్చినా వారు సహించలేరని మొత్తం దర్యాప్తునే తప్పుదోవ పట్టిస్తారని రకరకాలుగా ఏపీ పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే బాధ్యత కలిగిన విపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీ పోలీసుల దర్యాప్తు పక్కాగా జరగదని తేల్చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటనను ఏపీ పోలీసుల చేత కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత జరిపించాలని ఆయన ఏకంగా కోర్టుకు ఎక్కారు. ఈ విషయం ఏపీ లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

చదవండి : కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు !

బాబు పోలీసుల దర్యాప్తుని నమ్మని జయరాం భార్య…

అయితే ఏపీ పోలీసులపై జగన్ వ్యక్తం చేసిన అనుమానాలు నూటికి నూరు పాళ్లు కరెక్టేనని నిరూపించే ఘటన ఒకటి ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఎంత అనుమానాలు లేకపోతే. ఏకంగా జగనే ఏపీ పోలీసుల దర్యాప్తు వద్దు అని చెప్తారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జగన్ వాదన నిజమనేలా జరిగిన ఘటన విషయానికి వస్తే… ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యాడు.

jayaram wife

అమెరికాలో కుటుంబం ఉంటుండగా జయరాం వ్యాపార పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో వివాహేతర బంధాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిక్కుల్లో ఇరుక్కున్న జయరాంను రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరిదే కీలక భూమిక అని ఆది నుంచి వినిపిస్తున్నా చివరకు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన ఏపీ పోలీసులు రాకేశ్ రెడ్డిని నిందితుడిగా తేల్చేసి తేల్చేసి చేతులు దులిపేసుకున్నారు.

ap police

ఏపీ పోలీసులు నిర్వహించిన మొత్తం దర్యాప్తు తేల్చిన నిజాలన్నింటినీ చూసిన జయరాం సతీమణి పద్మశ్రీ , సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పోలీసుల నిర్వహించిన విచారణపై తనకు అనుమానాలు ఉన్నాయని , ఈ కేసును తెలంగాణ పోలీసుల చేత జరిపించాలని ఆమె తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా ఏపీ పోలీసులు నిర్వహించిన దర్యాప్తుపై ఆమె తన అనుమానాలను కుండబద్దలు కొట్టారు. ఈ ఒక్క విషయం చాలు ఏపీ పోలీసుల పై ప్రజలు ఎంత నమ్మకంగా ఉన్నారో చెప్పడానికి. ఎక్కడో దేశం కానీ దేశం నుండి వచ్చిన ఆమె ఏపీ పోలీసులని నమ్మలేని స్థితి వచ్చింది. ఇక ప్రతిపక్ష నేత జగన్ ఎలా నమ్ముతాడు. జగన్ పై దాడి జరిగిన గంట లోపే ఏపీ పోలీస్ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, చిన్న దాడిగా అభివర్ణించారు.

- Advertisement -