66వ జాతీయ చలన చిత్ర అవార్డులు: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’

mahanati
- Advertisement -

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో సినీ రంగానికి సంబంధించి ఏటా ప్రకటించే ‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను శుక్రవారం(ఆగస్ట్ 9) ప్రకటించారు. ఈ 66వ చలన చిత్ర అవార్డులు ఏప్రిల్ నెలలోనే ప్రకటించాల్సి ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా అవార్డుల ప్రకటనలో జాప్యం జరిగింది.

వివిధ చిత్రాలను పరిశీలించిన అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు జ్యూరీ కమిటీ నివేదిక అందించింది. ఈసారి తెలుగు చిత్రాలకు అవార్డుల పంటపండింది. 

ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి, ఉత్తమ కాస్టూమ్ డిజైనర్(మహానటి), ఉత్తమ ఆడియోగ్రఫీ రాజా కృష్ణన్(రంగస్థలం), బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చిలసౌ(తెలుగు), బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : అ!(తెలుగు) నిలిచాయి. 

ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు.

అవార్డులు – విజేతలు 

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం: మహానటి
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: ‘మహానటి’ 
ఉత్తమ ఆడియోగ్రఫీ: రాజాకృష్ణన్ (రంగస్థలం)
బెస్ట్ యాక్షన్ చిత్రం: ‘కేజీఎఫ్’

ఉత్తమ జాతీయ హిందీ చిత్రం: అందాధున్
ఉత్తమ జాతీయ మరాఠీ చిత్రం: భోంగా
ఉత్తమ జాతీయ తమిళ చిత్రం: బారమ్
ఉత్తమ ఉర్దూ చిత్రం: ‘హమీద్’
ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం: పద్మావత్

ఉత్తమ నటీనటులు

బెస్ట్ యాక్టర్స్: ఆయుష్మాన్ ఖురానా(అందాధున్), విక్కీ కౌశల్(యురి: ది సర్జికల్ స్ట్రైక్స్)
ఉత్తమ నటి: కీర్తి సురేష్
ఉత్తమ డైరెక్షన్: ఆదిత్య ధర్ (యురి)

ఉత్తమ లిరిక్స్: మంజునాత్(నాతిచరామి)
ఉత్తమ సంగీతం: పద్మావత్
ఉత్తమ నేపథ్య సంగీతం: యురి: ది సర్జికల్ స్ట్రైక్స్
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: రంజిత్(అ!)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కుమార సంభవం
ఉత్తమ ఎడిటింగ్: నాతిచారామి
ఉత్తమ లొకేషన్ సౌండ్: టెండల్య
ఉత్తమ సౌండ్ డిజైన్: యురి
ఉత్తమ మిక్డ్స్ ట్రాక్: రంగస్థలం
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: అంధధున్
ఉత్తమ సంభాషణ: తారిఖ్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఉలు
ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్: బిందు మణి(నాతిచరామి నుండి మాయావి మానవే)
ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్: అరిజిత్ సింగ్ (పద్మావత్ నుండి బింటే దిల్)
ఉత్తమ బాల కళాకారులు: పి.వి.రోహిత్, సమిత్ సింగ్, తాలా ఆర్చల్‌రేషు, శ్రీనివాస్ పోకాలే 

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు

ఉత్తమ రాజస్థానీ చిత్రం: టర్టల్
ఉత్తమ గారో చిత్రం: అన్నా
ఉత్తమ మరాఠీ చిత్రం: భోంగా
ఉత్తమ తమిళ చిత్రం: బారమ్
ఉత్తమ హిందీ చిత్రం: అంధధున్
ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
ఉత్తమ బెంగాలీ చిత్రం: ఏక్ జె చిలో రాజా
ఉత్తమ మలయాళ చిత్రం: సుడానీ ఫ్రమ్ నైజీరియా
ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
ఉత్తమ కన్నడ చిత్రం: నాతిచరామి
ఉత్తమ కొంకణి చిత్రం: అమోరి
ఉత్తమ అస్సామీ చిత్రం: బుల్బుల్ కెన్ సింగ్
ఉత్తమ పంజాబీ చిత్రం: హర్జీత
ఉత్తమ గుజరాతీ చిత్రం: రేవా

ఉత్తమ సహాయ నటీనటులు 

ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ (బధాయి హో )
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్కిరే (చుంబాక్ )
ఉత్తమ పిల్లల చిత్రం: సర్కారి హిరియా ప్రతమిక షేల్, కాసరగోడు

సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా ‘ప్యాడ్ మ్యాన్’ 

అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే నటించిన ‘ప్యాడ్ మ్యాన్’ సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా నిలిచింది.  

- Advertisement -