నటి షాకింగ్ కామెంట్స్: పెళ్లెందుకు దండగ.. రోజూ వాడి ముఖమే చూడాలా? లవ్ వస్తుంటుంది.. పోతుంటుంది!

sarath kumar daughter varalakshmi controversial comments on marriage
- Advertisement -

sarath kumar daughter varalakshmi controversial comments on marriage2

చెన్నై: తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమ.. పెళ్లి తదితర విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.  హీరో విశాల్‌తో ప్రేమాయణం.. తర్వాత  బ్రేకప్ తదితర హాట్ టాపిక్స్‌తో వార్తల్లో నిల్చిన వరలక్ష్మి‌కి ప్రస్తుతం హీరోయిన్‌ అవకాశాలు లేకపోవడంతో  లేడీ విలన్ పాత్రలు చేస్తోంది. చాలా కాలం విరామం తరువాత విశాల్ ‘పందెం కోడి 2’లో లేడీ విలన్‌గా నటించిన ఆమె.. విజయ్ ‘సర్కార్’ మూవీలో కూడా ప్రతి నాయిక పాత్రతో ఆకట్టుకుంది.

భారీ దేహంతో కోమలవల్లిగా పొలిటీషియన్‌ పాత్రలో వరలక్ష్మి పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. ఈ ‘సర్కార్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సర్కార్’ సినిమా ముచ్చట్లతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా ‘బోల్డ్’గా చెప్పుకొచ్చింది.

రాజకీయాల్లోకి వస్తా…

‘‘ప్రస్తుతం హీరోయిన్‌గా, విలన్‌గా చేస్తున్నా.. ప్రొడక్షన్ హౌస్ పెట్టే ఉద్దేశం అయితే లేదు కాని.. త్వరలో ఓ థ్రిల్లర్ సినిమాకి  డైరెక్షన్ చేస్తా. అయితే డైరెక్టర్ కావాలనేది నా జీవిత లక్ష్యంమేమీ కాదు.. అంతేకాదు, త్వరలోనే పాలిటిక్స్‌లోకి వస్తా.. వచ్చి మహిళలకు అండగా నిలబడటమే నా ప్రధాన లక్ష్యం..’’ అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ తన మనసులోని మాట బయట పెట్టారు.

పెళ్ళి గురించి అడిగితే…

ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడు? అని  వరలక్ష్మిని అడిగినప్పుడు.. మొహం చిరాకుగా పెట్టి ఏదో అడగకూడని మాట అడిగినట్టు అసహ్యించుకుంటూ.. ‘‘మహిళలకు మ్యారేజ్ అంటే యాంబిషన్ కాదు. వాళ్ళు ముందు అది తెలుసుకోవాలి. రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం అదో యాంబిషన్.. సినిమాల్లో రాణించాలి అనుకోవడం అదో యాంబిషన్.. జీవితంలో ముందుకు వెళ్లడానికి యాంబిషన్ ఉండాలి..’’ అంటూ చెప్పుకొచ్చింది.

అంతేనా? ‘‘అసలు పెళ్లి చేసుకుని ఏం చేస్తారో చెప్పండి. ఏదైనా.. ఎవరైనా యూజ్ అండ్ త్రోనే కదా? లవ్ చేస్తే చేసుకోవచ్చు. పెళ్లి మాత్రం టైమ్ వేస్ట్ పని. పెళ్లి చేసుకుని అదే ముఖాన్ని రోజూ చూడాలి. ఎవరి కోసం చూడాలి? ఎందుకోసం చూడాలి?’’ అంటూ ఘటైన వ్యాఖ్యలు చేసింది.

‘‘ప్రేమను పంచడంలో తప్పులేదు కానీ దానిని  పెళ్లితో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు.. ఎందుకు చేసుకోలేదని ఎవరైనా ఆయన్ని అడుగుతారా? మహిళలు కూడా అంతే. ఏ విషయంలోనూ మహిళలు ఒకడిపై ఆధారపడకూడదనేది నా అభిప్రాయం..’’ అంటూ కుండ బద్ధలు కొట్టింది.

నాకు ప్రేమ వస్తుంది, పోతుంది.. ఇట్స్ కామన్…

ఇక మీరు ఎవర్నీ లవ్ చేయాలేదా? అని అడిగితే.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది వరలక్ష్మి. ‘‘నాకు లవ్ వచ్చింది.. పోయింది.. వచ్చింది పోయింది.. అలా వస్తూనే ఉంటుంది.. పోతూనే ఉంటుంది. ఎందుకంటే నా జీవితాన్ని నేను హ్యాండిల్ చేసుకుంటున్నా..’’ అనేసింది సింపుల్‌గా.

‘‘నా యాంబిషన్స్‌ని, నా సక్సెస్‌ని నేను సక్సెఫుల్‌గా హ్యాండిల్ చేసుకుంటున్నా.. ఇందులోకి వేరే వ్యక్తి వస్తే నాకు ఇన్ సెక్యూర్‌గా అనిపిస్తుంది. నా వల్ల వాళ్లు కూడా ఇబ్బంది పడొచ్చు. ఇలాంటి ఇబ్బందులేం లేకుండా ఉండాలంటే.. అంటే.. అలాంటి వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే సింగిల్‌గానే ఉంటా.. నాకు ఏం ఇబ్బంది లేదు..’’ అంటూ బోల్డ్‌గా మాట్లాడేసింది. ఎంతైనా వరలక్ష్మా.. మజాకా!

 

 

- Advertisement -