- Advertisement -
రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే రేఖాదేవి తెలియజేశారు. ఆయన నిలబడలేకపోతున్నారని, అలాగే కూర్చోలేకపోతున్నారని, లాలూ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోయాయని ఆమె పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను ఇతర ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.
రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో శనివారం లాలూ ప్రసాద్ యాదవ్‌ను రేఖాదేవి కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ లాలూ ఆరోగ్యం గురించి ఆందోళనను వ్యక్త చేశారు.. దాణా కుంభకోణం కోసులో లాలూ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. అలాగే ఆయన పెద్ద కుమారుడి వైవాహిక జీవితం ఆటుపోట్లకు గురవడం కూడా ఆయనను మరింత క్షోభకు గురి చేసింది. దీంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.
- Advertisement -