షాకింగ్: కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌‌కూ ‘కరోనా’! ‘బాలీవుడ్’లో భయాందోళనలు…

- Advertisement -

ముంబై: బాలీవుడ్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. ఇటీవలే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడగా, తాజాగా హీరోయిన్ కత్రినా కైఫ్ కోవిడ్ బారిన పడ్డారు.

అక్షయ్‌ కుమార్‌ తాజా చిత్రం ‘సూర్యవంశీ’లో ఆయనతో కలిసి కత్రినా నటించింది. ఈ చిత్రం ఇంకా విడుదల కూడా కాలేదు.

అంతేకాదు, ఆమె బాయ్ ఫ్రెండ్‌గా గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తోన్న విక్కీ కౌశల్‌కు ‌కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఆ మర్నాడే కత్రినా కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమె కూడా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది.

‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే ఐసోలేషన్ అయ్యాను. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నా.. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నా..’’ అని పేర్కొంది.

అంతేకాదు, ఈ మధ్య కాలంలో తనతో కలిసిన వాళ్లంతా కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరింది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ తన పోస్టులో పేర్కొంది కత్రినా.

బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన…

ఇక మహారాష్ట్రను కరోనా వైరస్ బెంబేలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ కేసుల్లో సగం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి.

మరోవైపు బాలీవుడ్‌లోనూ కరోనా చాలా వేగంగా విస్తరిస్తోంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న ‘రామసేతు’ చిత్ర యూనిట్ సభ్యుల్లో 40 మంది వరకు జూనియర్ ఆర్టిస్టులు కరోనా బారిన పడడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Also Read: ఇటు ‘సౌత్’.. అటు ‘నార్త్’: వరుస చిత్రాలతో.. జోరుగా హుషారుగా.. రకుల్ ప్రీత్ సింగ్!
- Advertisement -